Saturday, February 2, 2013

శ్వాస దాగిపోయెను


నిన్ను చూడక కృష్ణమ్మ పాయ , గంగమ్మ పాయ కలసి పోయెను సంద్రములో ..

 నీ జాడలేక కొండల్లో లోయ , ఎండల్లో నీడ కరిగిపోయెను కన్నీటితో ..

నీ పిలుపులేక సెలయేటి హోరు , పలికేటి పెదవి మూగబోయెను మౌనంతో ..

నీ నవ్వులేక కలలు లేని నిద్దుర , కుసేటి కోయిల విసిగెను విరహం తో ..

నీ ప్రేమలేక నిజము కాని ఆశ , వదిలి పోనీ శ్వాస  దాగిపోయెను ఈ  కవితలో.

                                                          ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment