Tuesday, March 21, 2023

చీపురా

 చీపురు

.........................…

పుల్ల పుల్లతోకలసి చీపురుగ మారి అంగటి లో ఆరుబయట చేరాను,


మావూరి జమిందారు కంట పడ్డాను  నన్నుకొనగ దర్జాగా కారులో ఎక్కాను ,


మూడు అంత్తస్తుల బంగళా చూసాను బోగబాగ్యాలకై హుందాగా కారు దిగాను,


కొత్తచీపురని నేలకేసి నన్ను బాదగా ఉక్కిరిబిక్కిరై నాలుగు దిక్కులు చూసాను,


చెత్త చెత్త తాకి చెత్తకుప్పలుతుడవగ బిత్తరపోయి నా ముక్కు మూసుకున్నాను,


నన్నుతాకి చేతులే కడుగగా అంటరానిదానివలె అవమానము పొందేను,


పండగొచ్చిన నాడు బూజులన్ని దులిపి బేరుమని మూలపడి ఏడ్చాను,


ఆలుమగల పోరులో ఆయుదముగ మూలదాగివున్న నేనే గుర్తుకొచ్చాను,


చేతులు మారి మారి నడ్డివిరిగి నేను మరు మూలపడ్డాను,


చీచీ చీపురా అనకుండ నాపై చిరుతవితనే రాసిన మీకవులకి నేను రుణపడివుంటాను.


         ......శిరీష్ శరత్

Saturday, October 10, 2020

శరీరం.....పుస్తకం

 శరీరం-పుస్తకం

...........................

నలుపుతెలుపుఅట్టలపుస్తకం,

బారుగనుదురేమెదటికాగితం,

కనుబొమ్మలేమెదటిసంతకం,

చారెడుకనులేప్రదమసూచకం,

బారెడుముక్కేమందపుగీత,

నోటిననాలుకేతెలిసినఅర్ధం,

గుండెనశబ్ధంఎగిరేకాగితం,

రెండుచేతులేదానికిరూపం,

రెండుకాళ్ళేకదకుగమ్యం,

మనిషిపేరేదానికినామం,

మనసేతెలుపునుదానిపరమార్ధం.

            —————శిరీష్శరత్


                     ......శిరీష్శరత్

Sunday, May 31, 2020

లకలకలకబాలక

లకలకలకబాలక,
చేరావాఅమ్మబొజ్జలోపదినెలలవెనుక,
లకలకలకబాలక,
మానిద్రఅంతాఇంకతికమక,
రాత్రిపగలైనవేళనిద్రఆఫీసుచేరేనిక,
ఇల్లంతనీడైపర్లుచూచిచైనారాకెట్ట్శకలాలుఅనుకుంటారిక,
అజాగ్రత్తగావుంటేపావనమేమాశరీరాలిక,

లకలకలకబాలక,
తెల్లజాతీయుడిగపుట్టినతెలుసుకోతెలుగింటరుచులుమరువక,
సాత్వికనీకుకూడాసాహిత్యముఅబ్బాలిక,
అందుకేచేశ్తానుఒకనెలపుట్టినరోజుసాహిత్యవేదికగ.

బంధాలు

తూచితేతూగిపోతున్నబంధాలకాలమా
పలకరిస్తేపారిపోతున్నప్రేమలసమయమా
ఆదిలోనేఅంతరించిపోతున్నఅనురాగమా
భావితరాలకుమీవిలువలుతెలియాలుసుమా
దానికినాందిమనకవితలుకవులేసుమా

రారాఅనరానారాయణని రారానారాయణరా

రారాఅనరానారాయణనిరారానారాయణరా,

నిత్యమునిన్నుపూజింతుముగాఇలలోఇలవేల్పువుగా,

నరునిజీవితముఒకనాటకము...
నరునికోరికలునిత్యనూతనముఅందుకెఅనరానారాయణనిరారానారాయణరా,

రెండుచక్రలాబండిఎక్కాము...
కోరికలెన్నోమోసుకొస్తాము....
ఎడుకొండలుచూడగానేఅలసిసొలసినఇదిమానవజీవితము,

పడిపడిలేచేపసితనమైనా...
పరుగులుతీసేయవ్వనమైనా...
వడివడిఅడుగులవ్ర్రద్దాప్యమైనాఅన్నినిన్నేచేరునయా,

కూడబెట్టాలనినోట్లవిలువలు...
కూలగొట్టాలనికోటివిలువలు...
కలుషితమైనకలియుగమంతాకోటికనులతోకాపాడవయ్యా,

చిరుచిరునవ్వులచిద్విలాసము....
దగదగమెరిసేదివ్యరూపముసప్తసిరులసిగకేఅందముఇచ్చునయా,

ఏడుకొండలుఎక్కినీవుఏలుతువుంటేదివిలోసురులుభువిలోనరులునిత్యమునిన్నేపూజింతురుగా.

రారాఅనరానారాయణనిరారానారాయణరా,
నిత్యమునిన్నుపూజింతుముగాఇలలోఇలవేల్పువుగా.
నాచిరుకవితరారాజు

............................................................

ఆహాఆహాఆహానేనుపుట్టిందిచిన్నగా...నేనుఉంటానుచిరుచేదుగా... నన్నువాడతారుకమ్మగా

నాపేరుఆవాలుగా,


ష్....ష్....ష్.....నేనుఉంటానునీకన్నాపెద్దగ.. నేనుమారితేఎర్రగాఉంటానుమహాతీయగా

నాపేరుశనగపప్పుగ,


నమ్మకండిఇవన్నివట్టిమాటలుగ..నేనుఉండేదిగుండ్రంగా..నారుచిఎరుగుదురేతరతరాలుగా

నాపేరుమినపప్పుగా,

మీపిచ్చి!!వెర్రిమెగ్గలేయగా..నేనుండేదిపచ్చగా.. వాసనచూస్తేవుంటుందిబలేబలేగ 

నాపేరుకరివేపాకుగ,


మీమాటలుచూస్తేజాలేస్తోందిగ.. మమ్మలనితింటేపరిగెత్తుతారుగ.. మేముంటాముమహాగాటుగ

మాపేరేఅల్లంపచ్చిమిచ్చిగ,

నేనుపుట్టిందినల్లగ..నన్నుతింటేమూస్తారుకళ్ళువిచిత్రంగా

నాపేరుచింతపండుగ,

గాటైనానన్నులొట్టలేసుకునితింటారుగ.. నాప్రియనేస్తంపసుపుగ.. మేములేనిదేమీరుచులన్నివ్యర్దంగ,

మాపేరుపసుపుఇంగువగ,

గోలచేయకండేగులకరాళ్ళలా..మీరంతామునిగితేలేదినాలోనేగా..నేనువేడెక్కితేఅయిపోతారుమసిబొగ్గులా

నాపేరేనూనెగా,

నేనుఉంటానుచాలాతెల్లగ..అందరినీనాలోనేకలుపుకుంటానుగ..నేనుఉండనుమీలాఅహంకారంగా

నాపేరుఅన్నముగ,

నామాటవినండిమంచిమిత్రులుగ.. 
ఉందాముమనమంతాకలసికట్టుగ..
మారదామవంటకాలలోరారాజుగ...
ఈజగమంతామెచ్చేకమ్మనిపులిహోరగా.

.........................శిరీష్శరత్