చీపురు
.........................…
పుల్ల పుల్లతోకలసి చీపురుగ మారి అంగటి లో ఆరుబయట చేరాను,
మావూరి జమిందారు కంట పడ్డాను నన్నుకొనగ దర్జాగా కారులో ఎక్కాను ,
మూడు అంత్తస్తుల బంగళా చూసాను బోగబాగ్యాలకై హుందాగా కారు దిగాను,
కొత్తచీపురని నేలకేసి నన్ను బాదగా ఉక్కిరిబిక్కిరై నాలుగు దిక్కులు చూసాను,
చెత్త చెత్త తాకి చెత్తకుప్పలుతుడవగ బిత్తరపోయి నా ముక్కు మూసుకున్నాను,
నన్నుతాకి చేతులే కడుగగా అంటరానిదానివలె అవమానము పొందేను,
పండగొచ్చిన నాడు బూజులన్ని దులిపి బేరుమని మూలపడి ఏడ్చాను,
ఆలుమగల పోరులో ఆయుదముగ మూలదాగివున్న నేనే గుర్తుకొచ్చాను,
చేతులు మారి మారి నడ్డివిరిగి నేను మరు మూలపడ్డాను,
చీచీ చీపురా అనకుండ నాపై చిరుతవితనే రాసిన మీకవులకి నేను రుణపడివుంటాను.
......శిరీష్ శరత్
No comments:
Post a Comment