తూరుపు తలుపులు తెరవంగా తొలి కిరణం నా తనువును తాకెనులె,
ప్రకృతి ప్రేమగ పిలవంగ నా పరువం పరుగులు తీయునులే ,
నిన్నే చేరిన నా ప్రతి చూపు చిరునవ్వుతో చిందేయునులే ,
నీ సొగసులు చూడగ నాలో సవ్వడి సరిగామలై మ్రోగెనులే ,
కమ్మని నీ కనులే తాకగ నా ప్రతి కవిత ధన్యము కాగలదే.
--------------------శిరీష్ శరత్
No comments:
Post a Comment