తడబడే అడుగుల తోడువై నడిపించావు ,
గతముకన్నా నీ స్నేహమే గొప్పదని నిరుపించావు ,
ఒరిగిపోయే వేళ వడిసి వడిసి వెనకనే వుండి పడుతున్నావు ,
చిగురుటాకును లాలించే పిల్లగాలివై జోలపాడతావు ,
దారితప్పే యెద సవ్వడిని సరిదిద్దుతున్నావు ,
తెలియని రేపటి ఆశలలో నా గమ్యాని చూపిస్తున్నావు ,
చిన్దేసే నీ చిరునవ్వులనే నాకు సిరులుగ కురిపిస్తున్నావు ,
జన్మిచే ప్రతి జన్మకీ నిన్నే సోదరిగా ఆశపడేలా చేసావు ,
ప్రతి ఉదయం వికసించే తేజమై విరబుయాలని కోరుకుంటున్నాను ,
జన్మించి నన్ను బందించిన ఈ బంధానికి ఈ కవితగా నేనే నీకు కానుకవుతున్నాను ,.
--------------------శిరీష్ శరత్
No comments:
Post a Comment