Sunday, December 30, 2012

"ఏదో అయింది"

ఏదో అయింది ఏదోదో అయింది
ఈ ప్రేమ చేసే మాయ ఏమైవుంటుంది
ప్రేమను చూసింది నా మనసే నచ్చింది
ఒద్దొదు అంటూనే హద్దులు దాటింది

                                  "ఏదో అయింది"

తూనీగల్లె ఎగిరోచింది ఈ ప్రేమ
తేనీరల్లె తీయగా వుంది ఈ ప్రేమ
తుమ్మెద వాలే పువ్వుగ ఉందే ఈ ప్రేమ
తొలి ముద్దల్లే తీయగా వుంది ఈ ప్రేమ

నను వీడని తీయని స్నేహం నే కోరే తీయని బంధం నను చేరే కమ్మని కావ్యం
నను వీడని నా తొలి ప్రాయం నే మరువని నా చిరు ప్రాయం నీలో దాగిన నా ప్రాణం

                                   "ఏదో అయింది"

పగలేమో వెన్నెల వుంది ఈ ప్రేమల్లో
రాత్రేమో వెలుగు వుంది ఈ ప్రేమల్లో
అందేమో చిందులు వేస్తోందీప్రేమలో
తనరూపే కనిపిస్తోంది ఈ ప్రేమల్లో

నా కనులను దాచేస్తోంది నా మనసును లాగేస్తోంది నా కలలో కలవరమై నను వేదిస్తోంది
నా సిగలో పువయింది నా శ్వాసకు శ్వాసైంది నా ఆశకు తోడై నను దోచేస్తోంది

                                    "ఏదో అయింది"

                                                      -------------శిరీష్ శరత్

No comments:

Post a Comment