Saturday, December 22, 2012

ఈ కమ్మని కావ్యం


ఒక కిరణం జ్వలిస్తూ జన్మిస్తూ జాలువారింది  ఈ ఉదయం ,

తానే పరవశిస్తూ ప్రయాణిస్తూ వెలుగులు నింపింది మా చెంత ఈ శుభోదయం ,

తపిస్తూ తన్వయిస్తూ పొందింది ప్రేమను మా హృదయం ఆ మరుక్షణం ,

సిరులు కురిపించే శ్రీలుగా మా ఇంట చేరింది ఒక తేజo  ,

తను ఏడ్చే రాగం లో వినిపించింది అన్నయ్య అను తీయని రాగం ,

చెల్లిగా నను చేరిన ఈ రోజు చిరు కానుకగా నేనిచ్చేది ఈ కమ్మని కావ్యం .


                                -----------------------శిరీష్ శరత్

No comments:

Post a Comment