Saturday, December 22, 2012

నీ ప్రేమ ఉపిరైనంతవరకు


మాట రాక తెరువలేదు.... మది పెదవులు  ఈ భువిని చేరిన రోజు ,

భాష రాక రాయలేదు.... నాభావన ఉహతెలియని వయసు వరకు ,

కలము పట్టినా .... రచింపలేదు కమ్మని కవితలు ప్రేమ తెలియని వరకు ,

ప్రేమకు అర్ధం తెలియక... ప్రేమించలేదు అమ్మలా లాలించే నిన్ను చూసేవరకు ,

సాగిపోతున్నా !.... ఆగే క్షణము తెలియక...     నీ ప్రేమ నాకు పంచిన రోజు వరకు ,

ప్రాణమంటే తీయనిది కాదనుకున్నా.... నీకై పరితపించే క్షణము వరకు ,

మరు జన్మకు తోడు లేదనుకున్నా...... నా ప్రాణానికి నీ ప్రేమే ఉపిరైనంతవరకు.

                                                 ------------------------------శిరీష్ శరత్ 

No comments:

Post a Comment