నీ తలపుల ఉదయానికి లేదే హృదయం ,
నా ఆశల హృదయానికి లేదే మరు ఉదయం ,
ఆరంబమైనా అంతమైన నీ తోడులేని నామదికేది పదిలం,
జాడలేదు నా గుండె గూటికి నువ్వు వదిలిన మరుక్షణం ,
జాలిపడను అంటూ జరిగిపోతోంది మనసులేని ఈ కాలం ,
శ్వాసకుడా భారమౌతు సాగాలేదే ఈ జీవన ప్రయాణం .
----------శిరీష్ శరత్
No comments:
Post a Comment