Saturday, August 13, 2011

దాసోహం

 జగమెరుగని తొమ్మిది నెలలు అమ్మతో చేశాను స్నేహం ,

జగతిలో ఎదిగేదాకా నాన్నతో చేశాను స్నేహం ,

నేర్చుకున్నది సరిదిద్దుకోవడానికి గురువుతో చేశాను స్నేహం ,

నాకై వేచి చూసిన నా జీవిత భాగస్వామితో చేశాను స్నేహం ,

లాలిపాడుతూ బుజ్జగిస్తూ నా బిడ్డతో చేశాను స్నేహం ,

అండ దండ వుంటూ ప్రాణమిచే మిత్రులతో చేశాను స్నేహం ,

నాతో ఎదిగే నా అన్నతో అక్కతో చేశాను స్నేహం ,

కనిపించని దేమునితో, నా మనసుతో చేశాను స్నేహం ,

ఇంత ప్రేమ పొందిన నేను ధన్యం అందుకే నా జీవితం మీ అందరికి దాసోహం.

                                                                                శిరిష్ శరత్

No comments:

Post a Comment