అందంకోసం ఆరాట పడ్డాయి కొన్ని అక్షరాలు ,
అలుపెరగక తిరిగాయి అందిన అన్నిలోకాలు ,
అలసట మరిచాయి తమ ఆశ తీరేవరకు ,
ఆంధ్ర దేశాన్ని చేరాయి కలను నిజము చేసుకొనుటకు ,
అందమైనది తెలుగు భాషనీ తెలుసుకున్నాయి చివరకు,
అ అంటూ ఆ నేనంటూ ఒక్కొకటి మారాయి తెలుగే భువిలో అందమంటూ ,
ఆనందంతో మారిపోయాయి పదాలుగా స్వరాలుగా తమ ఆశ తీరేటట్టు,
ఆస్వాదిస్తూ మారిపోయాయి మన ఈ కవితలుగా చిరకాలం నిలిచిపోవాలంటూ,
అందుకే వుంటాయి మన తెలుగు కవితలు ఈ జగతికి వన్నెతెచేటట్టు.
శిరిష్ శరత్
శిరిష్ శరత్
No comments:
Post a Comment