ఇంద్రదనసును నేనివ్వలేను వచ్చిపోయే రంగుల కల అది ,
పున్నమి జాబిలిని నేనివ్వలేను నిత్యం ఉండని అందం అది ,
తరిగిపోయే వయసును నేనివ్వలేను కరిగిపోయే కాలం అది,
నీ పుట్టిన రోజుకు నేనివ్వగలను నీకై రాసిన ఒక తీయని కావ్యమిది .
శిరిష్ శరత్
నేను శ్రీ శ్రీ ను కాను నేను సిరి వెన్నెలను కాను... పిలువంగా పలుకంగా పరమ శివుడను కాను.... శతకోటి మనసులు దోచేటి సంగీతమును కాను.... కవితలోదిలే పాదాల చెంత చిరుకవిని కాను... ఈ కవిత చందవంగా స్పందిచు మీ మనసునే నేను. **** శిరిష్ శరత్ ****
No comments:
Post a Comment